పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్.. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి!
- పిఠాపురాన్ని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన వరుణ్ తేజ్
- ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పటికే అక్కడ 10 ఎకరాల భూమి కొనుగోలు!
- పిఠాపురం ప్రజలకు చేరువకానున్న అత్యంత అధునాతన వైద్య సేవలు
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పవన్‌ను గెలిపించిన పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హంగులతో అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నట్టు సమాచారం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.
పవన్ కల్యాణ్‌కు రామ్‌చరణ్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం రామ్‌చరణ్, ఉపాసన దంపతులు అక్కడ పది ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఆయన ఆ విషయం చెప్పగానే అది కాస్తా సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అయితే, పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రాబోతోందని తెలియగానే పవన్ అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో పవన్ కోసం ప్రచారం చేసిన వరుణ్ తేజ్ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరూ ఉహించనంతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పుడు అందుకు అపోలో ఆసుపత్రి నిర్మాణంతో బీజం పడబోతోంది. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఆ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.