తైవాన్‌ను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదు
తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో శుక్రవారం ప్రకంపనలు వచ్చాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్‌కు 34 కిమీ దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రం 9.7 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించినట్లు సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.