మాచ‌ర్ల‌లో వైసీపీకి ఎదురుదెబ్బ‌!

  • మాచ‌ర్ల‌ మున్సిపాలిటీలో పట్టుబిగిస్తున్న టీడీపీ 
  • ఇప్ప‌టికే టీడీపీలోకి 14 మంది వైసీపీ కౌన్సిల‌ర్లు 
  • ఇప్పుడు ఛైర్మ‌న్ ఏసోబు, వైస్ ఛైర్మ‌న్ న‌ర‌సింహారావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం
  • తాజాగా స్థానిక ఎమ్మెల్యే బ్ర‌హ్మారెడ్డితో ఛైర్మ‌న్, వైస్ ఛైర్మ‌న్ భేటీ
ప‌ల్నాడు జిల్లాలోని మాచ‌ర్లలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. మాచ‌ర్ల‌ మున్సిపాలిటీలో టీడీపీ పట్టుబిగిస్తోంది. ఇప్ప‌టికే 14 మంది వైసీపీ కౌన్సిల‌ర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ చిన్న ఏసోబు, వైస్ ఛైర్మ‌న్ న‌ర‌సింహారావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 

గురువారం వారు స్థానిక ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డితో స‌మావేశ‌మ‌య్యారు. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో శ‌నివారం వారు టీడీపీ కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఇక మాచ‌ర్ల‌లో మొత్తం 31 వార్డులుండ‌గా, 2022లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో  వైసీపీ విజయం సాధించింది. 
 
ఇప్పుడు రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డంతో మాచ‌ర్ల‌లో రాజ‌కీయం మారింది. కౌన్సిల‌ర్లు ఒక్కొక్క‌రు టీడీపీలో చేరుతున్నారు. ఇప్ప‌టికే 14 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు ఛైర్మ‌న్‌, వైస్ ఛైర్మ‌న్ కూడా చేరితే టీడీపీ బలం 16కు చేర‌నుంది.


More Telugu News