బాలకృష్ణ పెద్ద మనసు.. చిన్నారి వైద్యానికి సాయం!
- కడియపులంక గ్రామానికి చెందిన బాలిక వైద్యానికి బాలయ్య హామీ
- హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో పాప చికిత్సకు ఆదేశం
- బాలకృష్ణ స్వయంగా వచ్చి కూతురు చికిత్సకు ఆదేశించడం మరవలేనాన్న పాప తండ్రి
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. కడియపులంక గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ పాండే స్థానికంగా పూలకుండీల షాపులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడింది.
ఈ విషయం జనసేన నేత రత్నం అయ్యప్ప దృష్టికి వెళ్లడం, ఆయన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు పాప పరిస్థితిని వివరించడం జరిగింది. దాంతో మంత్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా బాలయ్యకు తెలిపారు.
వెంటనే స్పందించిన బాలకృష్ణ చిన్నారిని హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు. అక్కడ బాలయ్య మనవతా హృదయంతో పాపకు కావాల్సిన పూర్తి వైద్య సదుపాయాల్ని అందించాలని వైద్యులను ఆదేశించారు. బాలకృష్ణ స్వయంగా వచ్చి కూతురు వైద్యచికిత్సకు ఆదేశించడం ఎప్పటికీ మరిచిపోలేనని తండ్రి రాజ్‌కుమార్ పాండే అన్నారు.