కేశినేనితో కలిసి 'హెల్త్ ఆన్ వీల్స్' ప్రారంభించిన సుజనా చౌదరి
- 30 నుంచి 40 ఏళ్ల వయసులో కూడా క్యాన్సర్ వస్తుందన్న సుజనా
- క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
- పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని వ్యాఖ్య
సుజనా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 'హెల్త్ ఆన్ వీల్స్' కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. విజయవాడలోని కేబీఎన్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి మాట్లాడుతూ... వైద్య చికిత్సల కంటే వ్యాధి నివారణే ముఖ్యమని చెప్పారు.
30 నుంచి 40 ఏళ్ల వయసులో కూడా క్యాన్సర్ వస్తుందని... దీన్ని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన లేదని... అందుకే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, చికిత్స కంటే వ్యాధుల నివారణ ఎందుకు ముఖ్యం? అనే విషయాలపై శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
ఆరోగ్య శిబిరం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి 20 వ్యాధులకు సంబంధించిన పరీక్షలకు స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని... కనీసం 10 శాతం మందైనా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధాతో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.