నాలుగేళ్ల క్రితం ఇదే రోజున అందరినీ షాక్ కు గురి చేసిన ధోనీ
- 2020 ఆగస్ట్ 15న రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ
- ధోనీ సడెన్ డెసిషన్ తో అందరూ ఆశ్చర్యానికి గురైన వైనం
- భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోనీ
అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినప్పటికీ... టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ లో ధోనీ తనదైన శైలిలో మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున సోషల్ మీడియా వేదికగా ధోనీ చేసిన ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను షాక్ కు గురి చేసింది.
2020 ఆగస్ట్ 15న యావత్ దేశం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. అదే రోజున తాను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ధోనీ ట్వీట్ చేశాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ధోనీ తీసుకున్న సడెన్ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా 3 ఐసీసీ టైటిల్స్ ను గెలుపొందింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.