కోల్‌కతా హత్యాచార ఘటనపై రాహుల్ గాంధీ తీరుపై టీఎంసీ మండిపాటు

  • రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో కథువా - కోల్‌కతా అనడాన్ని తప్పుబట్టిన టీఎంసీ ఎంపీ
  • కథువా నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన నిందితుడిని కాంగ్రెస్ చేర్చుకుందని విమర్శ
  • సీపీఎం పాలనలో జరిగిన క్రూరమైన నేరాలపై కాంగ్రెస్ మౌనం వహించిందన్న మమతా బెనర్జీ
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు పట్ల తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత తీరును తప్పుబట్టారు. రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో కథువా - కోల్‌కతా అనడం సరికాదన్నారు.

ఇక్కడి ఘటనకు విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కథువా నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న లాల్ సింగ్‌ను కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకుందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి టిక్కెట్లు కూడా ఇచ్చారన్నారు.

కాంగ్రెస్ పార్టీపై మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం పాలనలో ఎన్నో క్రూరమైన నేరాలు జరిగాయని ఆరోపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉందన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోవడంతో వాటిపై ప్రజలకు అవగాహన లేకుండా పోయిందన్నారు.


More Telugu News