ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభం... టిఫిన్, భోజనాల టైమింగ్స్ ఇవే!
- నేడు అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- రూ. 5కే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్
- మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు భోజనం
తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో అన్న క్యాంటీన్లను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్లను మూసివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో... అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు.
గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాయి. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి టోకెన్లు కొనుగోలు చేసి క్యాంటీన్ లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
అన్న క్యాంటీన్లలో రూ. 5కే టిఫిన్, భోజనాన్ని అందిస్తారు. నామమాత్రపు ధరతో పేదలు కడుపు నింపుకోవాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు.
ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి ప్రతి రోజు 1.05 లక్షల మందికి ఆహారాన్ని సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేల మందికి భోజనం, రాత్రి మరో 35 వేల మందికి భోజనం అందించనున్నారు.
ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు భోజనాన్ని అందిస్తారు. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు డిన్నర్ ఉంటుంది.