స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీల విషెస్.. స్పెషల్ అట్రాక్షన్‌గా 'కల్కి' 50రోజుల పోస్టర్!
- 'ఎక్స్' వేదికగా చిరు, ఎన్టీఆర్, బన్నీ, ప్రశాంత్ వర్మ స్పెషల్ ట్వీట్స్
- ఇండిపెండెన్స్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన కల్కి టీమ్
- సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సెలబ్రిటీల పోస్టులు
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, అల్లు అర్జున్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ లు పెట్టారు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ 'కల్కి' చిత్రం యూనిట్ కూడా ఇండిపెండెన్స్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' ఇవాళ్టి (గురువారం)తో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమను ఆదరించిన ప్రేక్షకులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీని సూపర్ హిట్ చేసినందుకు వరల్డ్‌వైడ్‌గా ఉన్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది చిత్ర బృందం.
'దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీని కోసం మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారు. వాళ్లందరినీ స్మరించుకుందాం. వారిని ఆదర్శంగా తీసుకుందాం. జైహింద్' అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
'అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్' అంటూ యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు.
'ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. జైహింద్' అని బన్నీ ట్వీట్ చేశారు.
'మనం రూపొందించే ప్రతి ఫ్రేమ్, మనం చెప్పే ప్రతి కథ, కలలు కనే స్వేచ్ఛనిచ్చిన త్యాగాలకు నివాళి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎంతో ధైర్యంగా మన మార్గాన్ని ఏర్పాటు చేసిన వారిని గౌరవిద్దాం. జై హింద్!' అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.