ఎంపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి
- కాంగో నుంచి పొరుగు దేశాలకు ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం
- ఒకరి నుంచి ఒకరికి సులభంగా సోకుతున్న మహమ్మారి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎంపాక్స్ మహమ్మారిని తాజాగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాలకు ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అరికట్టడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఓ వైరస్ కారణంగా కాంగోలో ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం.
ఇది సోకిన వ్యక్తుల నుంచి సులభంగా అవతలి వారికి సోకుతోంది. ఇక ఎంపాక్స్ సోకిన వ్యక్తుల్లో మొదట దీని తీవ్రత సాధారణంగానే ఉన్నప్పటికీ, కొందరిలో మాత్రం ప్రాణాంతకంగా మారుతోంది. దీని బారిన పడిన వారిలో తొలుత ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. శరీరంపై గాయాలు అవుతాయి. గతంలో కాంగోలో భారీగా ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. అప్పుడు దాదాపు 300 మంది మృతిచెందారు. దాంతో 2022లోనూ డబ్ల్యూహెచ్ఓ ఇలా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.