రైల్వేలో ఉద్యోగాలు... ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

  • 4,096 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్‌ఆర్‌సీ, నార్త్ రైల్వే
  • ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగనున్న అప్లికేషన్లు
  • రూ.100 ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం
రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఉత్తర రైల్వే, ఆర్‌ఆర్‌సీ (రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్) వేర్వేరు విభాగాల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. 

వివిధ విభాగాలు, యూనిట్‌లు, వర్క్‌షాప్‌లలో కలిపి మొత్తం 4,096 అప్రెంటీస్‌ ఖాళీలు ఉన్నాయని వెల్లడించాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపాయి. 

కాగా ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్‌కు ఎంపికైన వారికి సమాచారం అందిస్తారు. విద్యార్హత విషయానికి వస్తే.. ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి. 

వయోపరిమితి 2024 సెప్టెంబర్ 16 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయసు 24 ఏళ్లు మించి ఉండకూదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఆసక్తిగల అభ్యర్థులు ఆర్ఆర్‌సీ, నార్త్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


More Telugu News