పాము కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం... చీకట్లో 11 వేల మంది
- హై ఓల్టేజీ జోన్‌లోకి ప్రవేశించి ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకిన పాము
- మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు
- అమెరికాలోని వర్జీనియాలో షాకింగ్ ఘటన
అమెరికాలోని వర్జీనియాలో ఓ పాము కారణంగా ఏకంగా 11,700 మంది విద్యుత్ వినియోగదారులు దాదాపు గంటన్నర పాటు చీకటిలో ఉండాల్సి వచ్చింది. ఓ పాము హై ఓల్టేజీ జోన్‌లోకి ప్రవేశించి ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడం ఈ పరిస్థితికి కారణమైంది. మంటలు చెలరేగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విషయాన్ని వెంటనే పసిగట్టిన అధికారులు దాదాపు గంటన్నర సమయం కష్టపడి విద్యుత్‌ను పునరుద్ధరించారు.
పాము కారణంగా కిల్న్ క్రీక్, సెంట్రల్ న్యూపోర్ట్ న్యూస్, క్రిస్టోఫర్ న్యూపోర్ట్ యూనివర్శిటీలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. శనివారం రాత్రి 9:15 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. కాగా ఈ అంతరాయానికి కారణమైంది ఏ జాతి పామో గుర్తించలేదని వివరించారు. అయితే ఈ ప్రాంతంలో పాముల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం ఇదే తొలిసారి కాదని అధికారులు చెబుతున్నారు.