కోలుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
- నిన్న భారీ నష్టాలు చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ
- నేడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు
- స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అంతర్జాతీయ విపణి నుంచి వీచిన సానుకూల పవనాలతో కోలుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 149.85 పాయింట్ల లాభంతో 79,105.88 వద్ద ముగియగా... నిఫ్టీ 4.75 పాయింట్ల స్వల్ప లాభంతో 24,143.75 వద్ద స్థిరపడింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ట్రెండ్ కనిపించింది. నిఫ్టీలో ఐటీ, సేవల రంగం, నిత్యావసరాల రంగాల షేర్లు లాభపడ్డాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్ ఎస్టేట్ షేర్లకు నేడు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.
సెన్సెక్స్ లో టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, భారతి ఎయిర్ టెల్ షేర్లు లాభాలు అందుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.