గురక ఎఫెక్ట్.. పోస్ట్ డిలీట్ చేసిన అర్షద్ నదీమ్... నెట్టిజన్ల ఫన్నీ కామెంట్స్!
- పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అర్షద్ నదీమ్
- స్వదేశానికి వచ్చిన తర్వాత తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న గోల్డెన్ బాయ్
- వీడియో ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఇస్తుండగా వెనుక నుంచి ఎవరో గురకపెట్టిన వైనం
- వెంటనే వీడియోను డిలీట్ చేసి, కొత్త వీడియో పోస్ట్ చేసిన నదీమ్
పాకిస్థాన్ గోల్డెన్ బాయ్ అర్షద్ నదీమ్ పారిస్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఈ పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ తాజాగా సోషల్ మీడియాలో స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్ వీడియోను డిలీట్ చేశాడు. ఆయన చక్కగా ముస్తాబై గదిలో కూర్చొని వీడియో ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఇస్తుండగా వెనుక నుంచి ఎవరో గురకపెడుతుండడం వినిపించింది.
ఆ సౌండ్ వీడియోలో వినిపించడం గుర్తించిన నదీమ్ వెంటనే పోస్టును డిలీట్ చేసి మరో వీడియో పోస్టు చేశాడు. అయితే, అర్షద్ పాత వీడియోను తొలగించేలోపే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తన వీడియోలో నదీమ్ "పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ఐక్యంగా ఉండేందుకు ఈ రోజున ప్రతిజ్ఞ చేయవలసిందిగా పాకిస్థాన్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పారిస్ ఒలింపిక్స్‌లో నేను స్వర్ణం సాధించిన తర్వాత ఆగస్ట్ 8వ తేదీన పాకిస్థాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలలో ఆనందం కనిపించింది. మీరు నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. 'యునైటెడ్ వి స్టాండ్' అని ప్రపంచానికి చూపుదాం" అని నదీమ్ ఉద్వేగభరితమైన సందేశాన్ని అందించారు.