కెన్యా జట్టు కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
- కెన్యా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ పేసర్ దొడ్డ గణేశ్
- కెన్యా జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం పట్ల హ్యాపీగా ఉందంటూ ట్వీట్
- కెన్యా చివరిసారిగా 2007లో ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్‌కు అర్హత
- ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 33వ స్థానంలో కెన్యా
కెన్యా పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ పేసర్ దొడ్డ గణేశ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఓ మీడియా ఈవెంట్‌లో ప్రధాన కోచ్‌గా గణేశ్‌ను కెన్యా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక కెన్యా జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం పట్ల హ్యాపీగా ఉందంటూ గణేశ్ ట్వీట్ చేశాడు. ఇకపోతే భారతీయులను కోచ్‌గా పెట్టుకోవడం కెన్యాకు కొత్తేం కాదు. టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ కోచింగ్ లో ఆ జట్టు 2003 వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది.
అయితే, ఇప్పుడు కెన్యా జట్టు పరిస్థితి వేరు. కెన్యా చివరిసారిగా 2007లో ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్‌కు అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 20 జట్లలో వారు ఎక్కడా కనిపించరు. అలాగే ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో కెన్యా ప్రస్తుతం 33వ స్థానంలో ఉంది. మలేషియా, స్పెయిన్, ఇటలీ, ఇతర దేశాల కంటే కెన్యా వెనుకబడి ఉంది.
ఇక కెన్యా ప్రధాన కోచ్‌గా గణేశ్ మొదటి అసైన్‌మెంట్ సెప్టెంబర్‌లో జరిగే ఐసీసీ డివిజన్ 2 ఛాలెంజ్ లీగ్. ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో కెన్యా పాల్గొననుంది.
గణేష్ అంతర్జాతీయ కెరీర్
ఈ కర్ణాటక మాజీ పేసర్ భారత్ తరఫున నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు, వన్డేల్లో ఒక వికెట్ తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే... రెడ్ బాల్ క్రికెట్‌లో 25 పరుగులు, వన్డేలలో నాలుగు పరుగులు చేశారు. గణేశ్ 1997లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాపై తన టెస్టు అరంగేట్రం చేశారు. అదే ఏడాది జింబాబ్వేపై వన్డేల్లో అరంగేట్రం చేశారు. అదే అతని ఫస్ట్ అండ్ లాస్ట్ వన్డే. తన చివరి టెస్ట్ మ్యాచ్‌ని ఏప్రిల్ 1997లో వెస్టిండీస్‌తో ఆడాడు.
దేశవాళీ క్రికెట్‌లో గణేశ్ గణాంకాలు ఇలా..
51 ఏళ్ల దొడ్డ గణేశ్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశారు. 104 ఫస్ట్-క్లాస్ మ్యాచులలో 20 పర్యాయాలు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆరు సార్లు 10 వికెట్ల ప్రదర్శనలతో సహా మొత్తం 365 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 133 ఇన్నింగ్స్‌లలో 18.39 సగటుతో ఒక సెంచరీ, ఏడు అర్ధసెంచరీలతో 2,023 పరుగులు చేశారు.
లిస్ట్ A క్రికెట్ (వన్డే)లో గణేశ్ సహా 128 వికెట్లు సాధించాడు. అలాగే 59 ఇన్నింగ్స్‌లలో 525 పరుగులు చేశాడు. తన ప్రొఫెషనల్ క్రికెట్‌లో చివరిసారిగా రంజీ ట్రోఫీ 2005-06 సీజన్ లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపించాడు.