నేను రాను, రానంటే రానంతే.. క్లాస్ టీచర్ కు ఏడో తరగతి విద్యార్థి సెలవు చీటీ
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
- ఇంగ్లిష్ అక్షరాలతో హిందీలో రాసిన బాలుడు
- స్కూలుకు వెళ్లాక నీకుంటుందంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
బాల్యం ఎంత మధురమో ఆ వయసు దాటొచ్చిన వారికి చెప్పక్కర్లేదు.. అయితే, బాల్యంలో మాత్రం చాలామందికి స్కూలుకు వెళ్లడం ఓ శిక్షలాంటిదే. ఎప్పుడైనా స్కూలు ఎగ్గొట్టాల్సి వస్తే ఆ సంతోషం మామూలుగా ఉండదు. అలాంటి సంతోష సమయంలో ఓ బాలుడు తన క్లాస్ టీచర్ కు రాసిన లీవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ స్టా పోస్ట్ వివరాల మేరకు సదరు విద్యార్థి పేరు రాకేశ్ అని తెలుస్తోంది. మిగతా వివరాలు మాత్రం తెలియరాలేదు.
స్కూలుకు రావట్లేదంటూ తన క్లాస్ టీచర్ కు సమాచారం ఇచ్చేందుకు రాకేశ్ రాసిన లెటర్ తొలుత పద్ధతి ప్రకారమే మొదలైంది. స్కూలు ప్రిన్సిపాల్ ను అడ్రస్ చేస్తూ డియర్ మేడమ్ అంటూ ప్రారంభించిన రాకేశ్.. ఆపై హిందీని ఎత్తుకున్నాడు. అది కూడా ఇంగ్లిష్ అక్షరాలతో.. ‘మై నహీ ఆవుంగా, నహీ ఆవుంగా, నహీ ఆవుంగా’ (నేను రాను, రానంటే రానంతే) అంటూ డిక్లేర్ చేసేశాడు. ఆపై థ్యాంక్యూ చెబుతూ మరోసారి స్కూలుకు వచ్చేదే లేదంటూ తేల్చిచెప్పాడు. దానికింద తన పేరు, డేట్ వేసి లీవ్ లెటర్ ను ముగించేశాడు.
ఈ లెటర్ ను ఇంట్లో వాళ్లు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. రాకేశ్ లెటర్ రాసిన తీరు, అందులోని భాష, స్పెల్లింగ్ మిస్టేక్ లను చూసి నెటిజన్లు నవ్వుతూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రిన్సిపాల్ స్పెల్లింగ్ తప్పు రాయడంతో ‘నాయనా రాకేశూ.. ఇవ్వాళ వెళ్లకపోయినా రేపయినా స్కూలుకు వెళతావుగా అప్పుడు ప్రిన్సిపాల్ చేతిలో నీకుంటుందిరా’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ రియాక్ట్ అవుతూ.. అబ్బో ఇలాంటి లీవ్ లెటర్ నా జీవితంలో రాయలేదని అన్నాడు. ఏదేమైనా నీ నిజాయతీ నచ్చిందంటూ రాకేశ్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.