ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన సింగపూర్ వర్సిటీ ప్రొఫెసర్ చౌదరి

  • ఏపీ వర్సిటీల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • పరిశోధనలు, ఆవిష్కరణల రంగంలో ఏపీ వర్సిటీలు వెనుకబడ్డాయన్న చౌదరి
  • అనేక అంశాల్లో మారాల్సి ఉందని వెల్లడి
సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి నేడు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. ఏపీలోని విశ్వవిద్యాలయాల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. 

పరిశోధనలు, ఆవిష్కరణల రంగంలో ఏపీ వర్సిటీలు వెనుకబడ్డాయని ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో సంస్కరణలకు సహకారం అందిస్తామని తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణల రంగంలో మెరుగుపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. 

మారుతున్న కాలానికి అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలను ఏపీ వర్సిటీలతో పంచుకునేందుకు సిద్ధమని ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి ప్రకటించారు. అనేక అంశాల్లో మార్పుతో ఏపీ వర్సిటీలకు మంచి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.


More Telugu News