భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 693 పాయింట్ల నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
  • 208 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • నష్టాల్లో ముగిసిన 2,322 స్టాక్స్... లాభాల్లో ముగిసిన 1,103 స్టాక్స్
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు భారీ నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాల్లో షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 693 పాయింట్లు నష్టపోయి 78,956 వద్ద ముగిసింది. నిఫ్టీ 208 పాయింట్లు పడిపోయి 24,139 పాయింట్ల వద్ద ముగిసింది. 1,103 స్టాక్స్ లాభాల్లో... 2,322 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 74 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు.

టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్స్, హెచ్‌సీఎల్ టెక్ ఉండగా, టాప్ లూజర్స్ జబితాలో శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెడల్, మీడియా, టెలికం ఇలా అన్ని రంగాలు కూడా ఒక శాతం వరకు నష్టాల్లో ముగిశాయి.

ఇంట్రాడే ట్రేడింగ్‌లో బ్యాంకుల షేర్లు ఇండెక్స్‌లపై ప్రభావం చూపడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా నష్టపోయాయి. టాప్ 10 అత్యంత విలువైన సంస్థల మార్కెట్ వ్యాల్యూ మంగళవారం రూ.62,042.2 కోట్లు తగ్గింది.


More Telugu News