రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకెంత కాలం క్రికెట్ ఆడగలరో అంచనా వేసిన హర్భజన్ సింగ్
- విరాట్ కోహ్లీ మరో 5 ఏళ్లు సులభంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడన్న భజ్జీ
- రోహిత్ శర్మ మరో రెండేళ్లు క్రికెట్ ఆడతాడన్న భజ్జీ
- ప్రస్తుతం ఇద్దరూ ఫిట్‌గానే ఉన్నారని వ్యాఖ్య
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలే టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో వీరిద్దరూ ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ ఎంతకాలం కొనసాగుతారనే ఆసక్తికర చర్చ చాలాకాలంగా నడుస్తోంది. ఈ డిబేట్‌పై టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికరంగా స్పందించాడు.
అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉండే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగగలడని హర్భజన్ అంచనా వేశాడు. విరాట్ కఠిన పరిస్థితులను సైతం సులభంగా అధిగమించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక టెస్ట్, వన్డే ఫార్మాట్ల కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కనీసం మరో రెండేళ్లు ఆడతాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ మరో రెండేళ్ల పాటు సులభంగా ఆడగలడని అంచనా వేశాడు.
విరాట్ ఫిట్‌నెస్ గురించి మీకు తెలియదు...
‘‘విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి మీకు తెలియదు. ఐదేళ్ల పాటు అతడు యువ క్రికెటర్లతో పోటీపడడాన్ని మీరు చూస్తారు. 19 ఏళ్ల యువ ఆటగాడితో పోటీ పెట్టినా అతడిని కోహ్లీ ఓడిస్తాడు. అతడు చాలా ఫిట్‌గా ఉంటాడు. విరాట్, రోహిత్‌లలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఎంతకాలం ఆడతారనేది వాళ్ల ఇష్టం. ఇద్దరూ తగిన ఫిట్‌నెస్‌తో ఉన్నారు. ఇద్దరూ రాణిస్తున్నారు. జట్టు కూడా గెలుస్తోంది కాబట్టి వారిని కొనసాగించాలి’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.