నా భార్య‌పై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది: మాధురి భ‌ర్త మ‌హేశ్

  • రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్య‌వ‌హారం  
  • ఈ వ్య‌వ‌హారంపై అమెరికాలో ఉంటున్న మాధురి భ‌ర్త మ‌హేశ్ స్పంద‌న‌
  • ఆమె రాజ‌కీయంగా ఎదుగుతుంద‌నే కార‌ణంతో ఆరోప‌ణ‌లంటూ వ్యాఖ్య‌
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్య‌వ‌హారం రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. సినిమా క‌థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టింగ్‌ ఎపిసోడ్స్ ఈ వ్య‌వ‌హారంలో చోటు చేసుకున్నాయి.  

ఈ క్ర‌మంలో త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకుని త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్నారనే మ‌న‌స్థాపంతో... ఆగి ఉన్న కారును త‌న కారుతో ఢీకొట్టి ఆత్మ‌హత్యాయ‌త్నం చేశారు. దాంతో ఈ ప్రమాదంలో గాయ‌ప‌డిన ఆమె పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తాజాగా మాధురి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 

ఈ వ్య‌వ‌హారంపై అమెరికాలో ఉంటున్న మాధురి భ‌ర్త దివ్వెల మ‌హేశ్ చంద్ర‌బోస్ తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టం లేద‌న్నారు. కానీ, మాధురి ఇష్ట‌ప‌డ‌టంతో వైసీపీలోకి వెళ్ల‌డానికి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని తెలిపారు. త‌న భార్య‌పై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, ఆమె రాజ‌కీయంగా ఎదుగుతుంద‌నే కావాల‌ని ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

ఇక ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన త‌ర్వాత మాధురి కూడా మీడియాతో మాట్లాడారు. దువ్వాడ వాణి రాజకీయ కోణంలోనే త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆ కార‌ణంగానే తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశానని ఆమె చెప్పారు.


More Telugu News