జూరాల డ్యామ్‌లో లీకేజీలు... డ్యామ్ భద్రతపై అనుమానాలు
- జూరాల డ్యామ్‌లోని కొన్ని గేట్లలో లీకేజీలు
- మరమ్మతులు చేయాలని చాన్నాళ్లుగా నిపుణుల సూచనలు
- 2021లో 62 గేట్లకు గాను ఐదింటికి మాత్రమే మరమ్మతులు
జూరాల డ్యామ్‌లో కొన్నిచోట్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఈ డ్యామ్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల డ్యాం భద్రతపై సండేహాలు తలెత్తుతున్నాయి.
జూరాల డ్యాం గేట్లలో పలుచోట్ల లీకేజీలు కనిపిస్తున్నాయి. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్యాం గేట్లకు మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. దీంతో 2021లో ప్రభుత్వం మరమ్మతుల కోసం కొన్ని నిధులను విడుదల చేసింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మొత్తం 62 గేట్లలో ఐదింటికి మాత్రమే మరమ్మతులు జరిపినట్లు అధికారులు తెలిపారు.