ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలకు అంతరాయం

  • జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్‌ను యాక్సెస్ చేయలేకపోయిన యూజర్లు
  • అమెరికా, యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అంతరాయం
  • అమెరికా కాలమానం ప్రకారం ఉదయం తలెత్తిన సమస్య
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికా సమయం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు అంతరాయం ఏర్పడింది.

అమెరికా, యూకేతో పాటు యూరోప్, ఆసియా, సౌత్ అమెరికాలోని పలు ప్రాంతాల్లో నెటిజన్లు సమస్యను ఎదుర్కొన్నారు. ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ కారణంగా విండోస్‌లో తీవ్ర సమస్య తలెత్తగా, తాజాగా గూగుల్ కు సమస్య ఎదురవడం గమనార్హం. దీనికి సంబంధించి గూగుల్ ప్రకటన చేయాల్సి ఉంది.

అమెరికాలో లక్షలాదిమంది ఉదయం పని ప్రారంభించిన సమయంలో వారి మెయిల్స్ పని చేయలేదు... కంటెంట్ కోసం గూగుల్ (సెర్చ్) చేయలేకపోయారు... వీడియోలు చూడలేకపోయారు. అమెరికాలో 57 శాతం మంది సెర్చ్, 32 శాతం మంది వెబ్ సైట్, 11 శాతం మంది గూగుల్ డ్రైవ్‌తో సమస్యను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.


More Telugu News