ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మృతిపై సంచలన వాస్తవం వెల్లడించిన భార్య
- ఇటీవల ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ కన్నుమూత
- అనారోగ్యంతో మరణించినట్టు వార్తలు
- ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన భార్య అమందా
ఇటీవల ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ నడివయసులోనే కన్నుమూయడం క్రికెట్ వర్గాలను తీవ్ర విషాదానికి గురిచేసింది. థోర్ప్ వయసు 55 సంవత్సరాలు. ఈ లెఫ్ట్ హ్యాండర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందినట్టు ఇటీవల ఓ ప్రకటన వెలువడింది.
అయితే, థోర్ప్ భార్య అమందా ఓ ఇంటర్వ్యూలో సంచలన వాస్తవం వెల్లడించారు. తన భర్త థోర్ప్ ది సహజ మరణం కాదని, థోర్ప్ బలవన్మరణం చెందాడని స్పష్టం చేశారు. థోర్ప్ గత రెండేళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని, అనారోగ్య సమస్యలతో మానసికంగా కుంగిపోయి రెండేళ్ల కిందట కూడా ఆత్మహత్యాయత్నం చేశాడని అమందా వివరించారు.
అప్పట్లో పరిస్థితి విషమించడంతో చాలాకాలం పాటు థోర్ప్ ఐసీయూలో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నట్టు అనిపించినా, మళ్లీ డిప్రెషన్ లోకి జారుకున్నాడని, మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఈసారి అతడిని కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, థోర్ప్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ఆయన కుమార్తె కిట్టీ కూడా నిర్ధారించింది. తమను ఎంతో ప్రేమించి తండ్రి ఇలా చేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది.