పులివెందుల జగనన్న మెగా లేఅవుట్లో రూ.175 కోట్ల స్కాం జరిగింది: భూమిరెడ్డి
- టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి ప్రెస్ మీట్
- పులివెందులలో అవినీతిని వెలికితీస్తామని స్పష్టీకరణ
- ఎక్కడైనా చర్చకు సిద్ధమని వెల్లడి
టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. పులివెందుల మున్సిపాలిటీలో జగనన్న మెగా లేఅవుట్ లో రూ.175 కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు. పులివెందులలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
"జగనన్న ఇళ్లలో అంతా అవినీతే. రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెబుతున్న జగన్ రెడ్డి... పులివెందులలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా? నియోజకవర్గంలో కాదు, కనీసం మున్సిపాలిటీల్లోని జగనన్న లేఅవుట్‌లో జరిగిన అక్రమాలపై పులివెందులలోనైనా, తాడేపల్లిలోనైనా చర్చకు నేను సిద్ధం.
పులివెందుల మున్సిపాలిటీలోని జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది బోగస్ లబ్ధిదారులు, అనర్హులు అని తేలింది. అంటే ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో రూ.175 కోట్ల స్కాం జరిగిందంటే... రాష్ర్ట వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కాం జరిగాయో ఒక్కసారి ఆలోచించాలి.
ఏపీఐజీసీకి చెందిన 250 ఎకరాల స్థలం తీసుకుని ఒక్కొక్క లబ్ధిదారుని ఒకటిన్నర సెంటు స్థలంలో రాష్ర్ట ప్రభుత్వమే కాంట్రాక్టర్లను నియమించి గృహ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాదాపు 23.67 శాతం మంది అనర్హులు అని తేలింది. వారంతా బోగస్ లబ్ధిదారులు, వైసీపీకి సంబందించిన బీనామీలు, దొంగ పేర్లు పెట్టుకుని కోట్లాది రూపాయలు కాజేసినది నిజం కాదా జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నా.
అంతేకాకుండా సొంత స్ధలాలు ఉన్నాయని గృహాలు మంజూరు చేయాలని దరఖాస్తు పెట్టుకున్న వారు 1,918 మంది అయితే... పెద్ద పెద్ద భవంతులు, ఇళ్లు ఉన్న వారు, కోటీశ్వరులు దాదాపు 732 మంది దొంగ లబ్ధిదారులు అందులో ఉన్నారని తేలిన విషయం వాస్తవం కాదా? అంటే దాదాపు 55.5 శాతం మంది మీ కార్యకర్తలు దొంగ పేర్లు పెట్టుకుని ప్రభుత్వం డబ్బు కాజేయాలని ఇళ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవం కాదా జగన్ రెడ్డీ? ” అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.