ఏపీలో ఈ నెలాఖరు, లేదా వచ్చే నెలలో అందుబాటులోకి ప్రముఖ మద్యం బ్రాండ్లు

  • ఏపీలో అక్టోబరు నుంచి నూతన మద్యం పాలసీ
  • పొరుగు రాష్ట్రాల మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్న ఏపీ అధికారులు
  • క్వార్టర్ ధర రూ.200 నుంచి రూ.100కి తగ్గే అవకాశం!
ఏపీలో అక్టోబరు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. దానికంటే ముందే, ప్రముఖ మద్యం బ్రాండ్లు ఏపీ మద్యం దుకాణాల్లో మళ్లీ సందడి చేయనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక పేరెన్నికగన్న మద్యం బ్రాండ్లను తొలగించారు. తాజాగా, నూతన మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 

ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెలలో కానీ ప్రముఖ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువరావాలని భావిస్తున్నారు. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు పొరుగు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేస్తున్నారు.

అంతేకాదు, మద్యం ధరలను కూడా గణనీయంగా తగ్గించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. రూ.200 ఉన్న క్వార్టర్ ను రూ.100కే అందించాలన్న ప్రతిపాదన ఉంది.


More Telugu News