తిరుమల ఘాట్ రోడ్లపై బైకుల రాకపోకలపై ఆంక్షలు... ఎందుకంటే...!

  • ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో జంతువుల సంతానోత్పత్తి 
  • ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే బైకులకు అనుమతి
  • భక్తులు ఈ మార్పును గమనించాలన్న టీటీడీ
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల ఘాట్ రోడ్లపై బైకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రెండు ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే బైకులను అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. 

ఆగస్టు, సెప్టెంబరు మాసాలు వన్యప్రాణులు సంతానోత్పత్తి జరుపుకునే కాలం అని తెలిపింది. అందుకే, అటు వన్యప్రాణుల ప్రయోజనాలు, ఇటు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్టు టీడీపీ వివరించింది. ఈ ఆంక్షలు ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటాయని, ఈ ఆంక్షలను భక్తులు గమనించాలని పేర్కొంది.


More Telugu News