ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రంలో మంటలు.. ఉక్రెయిన్ పనే అంటున్న రష్యా.. వీడియో ఇదిగో!

  • ఉక్రెయిన్ దాడుల్లో జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రంలో మంటలు
  • కమికాజ్ ట్రోన్‌తో ఉక్రెయిన్ దాడిచేసిందన్న రష్యా
  • తమకు సంబంధం లేదన్న ఉక్రెయిన్
  • న్యూక్లియర్ టెర్రర్‌ను రెచ్చగొట్టేందుకు రష్యానే ఆ పని చేసిందని ఆరోపణ
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐరోపాలోనే అతిపెద్దదైన జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో మంటలు అంటుకుని ధ్వంసమైంది. వాస్తవానికి ఇది ఉక్రెయిన్ దే అయినప్పటికీ, 2022 నుంచి ఈ కేంద్రం  రష్యా అధీనంలో ఉంది. తాజాగా, ఇది ఉక్రెయిన్ దాడిలో దెబ్బతిన్నట్టు రష్యా ఆరోపిస్తోంది.  కమికాజ్ డ్రోన్‌ను ఉపయోగించి ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్టు రష్యా మీడియాను ఉటంకిస్తూ జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్లాంట్ ఇంత దారుణంగా దెబ్బతినడం ఇదే తొలిసారి.

అగ్ని ప్రమాదం కారణంగా కూలింగ్ సిస్టం వద్ద నష్టం వాటిల్లినప్పటికీ ప్లాంట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకమూ కలగలేదని పవర్ ప్లాంట్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ యెవ్‌జీనియా  యషీనా తెలిపారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా ప్లాంట్‌కు మంటలు అంటుకున్నట్టు జపోరిజియా ప్రాంత గవర్నర్  యెవ్‌గెనీ బాలిట్‌స్కీ ఆరోపించారు. అయితే, ఉక్రెయిన్ మాత్రం ‘న్యూక్లియర్ టెర్రర్’‌ను రెచ్చగొట్టేందుకు రష్యానే ఉద్దేశపూర్వకంగా ప్లాంట్‌ను ధ్వంసం చేస్తోందని ఆరోపించింది.


More Telugu News