లంచంగా 5 కేజీల బంగాళదుంపల డిమాండ్.. ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ

  • ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘటన
  • ఓ కేసులో ఐదు కేజీల బంగాళదుంపలు డిమాండ్ చేసిన ఎస్సై
  • రెండు కేజీలు మాత్రమే ఇవ్వగలనన్న బాధితుడు
  • కుదరదన్న ఎస్సై.. మిగతా మూడు కేజీలు తర్వాత ఇవ్వాలని షరతు
  • వీడియో వైరల్ కావడంతో ఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ
లంచంగా ఐదు కేజీల బంగాళదుంపలు డిమాండ్ చేసిన ఎస్సైని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిందీ ఘటన. అదనపు ఎస్పీ అజయ్ కుమార్ కథనం ప్రకారం.. షౌరిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చపున్నా ఔట్‌పోస్టు‌లో ఎస్సై రాంకృపాల్ స్టేషన్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. ఓ కేసులో లంచంగా ఐదు కేజీల బంగాళదుంపలు ఇవ్వాలని బాధితుడికి ఫోన్ చేసి డిమాండ్ చేస్తున్న ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. రామ్‌కుమార్‌ను తక్షణం విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీచేశారు.

వైరల్ అయిన ఆడియోలో బాధితుడు తాను రెండు కిలోల బంగాళదుంపలు మాత్రమే ఇవ్వగలనని వేడుకున్నాడు. అయితే, అలా కుదరదని, ముందుగా అనుకున్నట్టు 5 కిలోల దుంపలు ఇస్తేనే కేసు సంగతి తేలుస్తానని ఎస్సై తేల్చి చెప్పాడు. అయితే, అందుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించదని బాధితుడు వేడుకోవడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపించింది. దీంతో ఎస్సై స్పందిస్తూ.. తొలుత రెండు కిలులు ఇచ్చి ఆ తర్వాత మిగతా మూడు కిలోలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.


More Telugu News