పెళ్లిళ్లను అపహాస్యం చేయకండి ప్లీజ్.. థియేటర్లలో వివాహాలపై కృష్ణవంశీ విజ్ఞప్తి
- 2001లో విడుదలైన మురారి సినిమా
- మహేశ్‌బాబు బర్త్ డే సందర్భంగా 4కే వెర్షన్‌లో రీరిలీజ్
- థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు
- ఆవేదన వ్యక్తం చేసిన దర్శకుడు కృష్ణవంశీ
థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకుని మన సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేయొద్దని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కోరారు. మహేశ్‌బాబు నటించిన సూపర్ హిట్ మూవీ మురారిని ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కొందరు యువతీయువకులు ఆ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోను చూసి కృష్ణవంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సినిమా హాళ్లలో పెళ్లిళ్లు చేసుకుని మన సంస్కృతిని అవమానించవద్దని కోరారు. తెలిసీ తెలియక వాళ్లు అలా చేసి ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్న ఆయన.. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్టు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
2001లో విడుదలైన మురారి సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించారు. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను మహేశ్‌బాబు బర్త్ డే సందర్భంగా 4కే వెర్షన్‌లో ఆగస్టు 9న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. సినిమాలో ‘అలనాటి రామచంద్రుడు..’ పాట వస్తున్న సమయంలో చాలా థియేటర్లలో పలవురు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని షేర్ చేస్తూ ‘కొత్త జంటలను ఆశీర్వదించాలని’ కృష్ణవంశీకి ట్యాగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ ఇలా స్పందించారు.