భారత్‌లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఏర్పడతాయా?.. కేంద్రమంత్రి సమాధానం ఇదే
- ఇది నరేంద్ర మోదీ భారతదేశం అని వ్యాఖ్యానించిన గజేంద్ర సింగ్ షెకావత్
- ఇది బంగ్లాదేశ్ కాదని విపక్షాలకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ఇటీవల భారత్‌లోనూ బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు రావొచ్చన్న సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్‌లకు కౌంటర్
మన దేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయంటూ విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. ‘‘ఇది బంగ్లాదేశ్ కాదని వాళ్లకు తెలియదేమో. ఇది నరేంద్ర మోదీ సారధ్యంలోని భారత్’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు జోధ్‌పూర్ విమానాశ్రయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్‌లో కూడా బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు ఏర్పడతాయని కొందరు వ్యాఖ్యానించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
భారతదేశంలో బంగ్లాదేశ్ పరిస్థితి రావొచ్చంటూ పదే పదే మాట్లాడుతున్నారని, అలాంటి పనులకు పాల్పడే వారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలని గజేంద్ర సింగ్ షెకావత్ హెచ్చరించారు. ఇక బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు ఊహించనివని, ఆమోదయోగ్యం కానివని షెకావత్ అన్నారు. బంగ్లాదేశ్‌పై భారత ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతుందని, శాంతిభద్రతలు దారికొచ్చి అక్కడి పరిస్థితులు మెరుగుపడాలని ఆయన అభిలాషించారు. అయితే షెకావత్ ఎవరి పేరునూ ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ.. కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన సమాధానం ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమైంది.
కాగా ఇటీవల ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. పైపైకి అన్నీ సాధారణంగా కనిపిస్తుండవచ్చు, కానీ బంగ్లాదేశ్‌లో జరుగుతోంది భారతదేశంలోనూ జరగవచ్చని వ్యాఖ్యానించారు. ఇక మణిశంకర్ అయ్యర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ పరిస్థితిని భారత్‌తో ఆయన పోల్చారు.