చన్నీటి స్నానంతో ఇంతటి ప్రమాదం ఉందని తెలుసా?
- చన్నీటి స్నానంతో హృద్రోగులకు ప్రమాదమని హెచ్చరిస్తున్న వైద్యులు
- గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని వార్నింగ్
- చల్లని నీరు కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుందని వివరణ
చన్నీటి స్నానంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్ నుంచి ఉపశమనం, రోగ నిరోధక శక్తి బలోపేతం, ఒత్తిడిలో తగ్గుదల, బడలిక నుంచి ఊరట తదితర ప్రయోజనాలు ఉన్నాయని వైద్య శాస్త్రం ఎప్పుడో రుజువు చేసింది. అయితే, చన్నీటి స్నానం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హృద్రోగులు చన్నీటి స్నానం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
చన్నీటి స్నానం చేసేటప్పుడు చర్మం కింద ఉన్న రక్త నాళాలు కుంచించుకుపోతాయట. ఫలితంగా రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గుండె మరింతగా శ్రమించాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుందట. చివరకు ఇది హార్ట్ ఎటాక్‌కు దారి తీసే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే దిగువకు పడిపోతే హైపోథెర్మియా అంటారు. ఇది గుండె కండరాలకు చేటు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు కూడా గుండె పోటు బారిన పడొచ్చట. చల్లటి నీరుతో పాటు, అకస్మాత్తుగా గాలి పీడనం, తేమ శాతంలో తగ్గుదల, తీవ్ర గాలులు కూడా గుండె పోటుకు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తసరఫరాలకు అడ్డంకులు ఏర్పడి గుండెపై ఒత్తిడి పెరుగుతుందని వివరించారు.
గుండె పోటు వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇవీ..
గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని గుర్తించిన వెంటనే ఆసుపత్రికి వెళితే ప్రాణాపాయాన్ని సులువుగా తప్పించుకోవచ్చు. గుండెపోటు వచ్చే ముందు.. ఛాతిలో నొప్పి, ఒత్తిడి, ఛాతి పట్టేస్తున్నట్టు భావన, భుజాలు, చేతులు, వీపు, దవడ, పళ్లల్లో తెలీని ఇబ్బంది లేదా నొప్పి, చల్లగా ఉన్నా చెమటలు పోయడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.