గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!

 
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో అనేక లోపాలు ఉన్నాయని, ఆ లొసుగులను ఉపయోగించుకుని హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

క్రోమ్ లో ఉన్న బగ్స్ కారణంగా హ్యాకర్లు కంప్యూటర్లను తమ అధీనంలోకి తీసుకునే వీలుంటుందని, ఆ కంప్యూటర్లను ఎక్కడ్నించైనా వారు ఆపరేట్ చేయగలరని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని  సీఈఆర్టీ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) వివరించింది. 

కంప్యూటర్ లో భద్రపరిచిన డేటాను, క్రోమ్ బ్రౌజర్ లో సేవ్ చేసిన పాస్ వర్డ్ లను కూడా హ్యాకర్లు దొంగిలించగలరని పేర్కొంది. ప్రమాదకర మాల్వేర్ లను కూడా వారు కంప్యూటర్ వ్యవస్థల్లోకి ప్రవేశపెట్టడం సాధ్యమవుతుందని తెలిపింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఉపయోగించేవారు వెంటనే లేటెస్ట్ వెర్షన్ తో అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ  స్పష్టం చేసింది.


More Telugu News