వినేశ్ ఫొగాట్ దురదృష్టవశాత్తూ పోటీకి దూరం కావాల్సి వచ్చింది: పవన్ కల్యాణ్
- కాంస్యం గెలిచిన అమన్ సెహ్రావత్‌కు అభినందనలు తెలిపిన పవన్
- రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమని వ్యాఖ్య
- అమన్ పతకం సాధించడంతో క్రీడాభిమానులు సంతోషంగా ఉన్నారన్న డిప్యూటీ సీఎం
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అమన్ కాంస్య పతకాన్ని సాధించడం ఆనందం కలిగించిందన్నారు. అమన్‌కు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమన్నారు. అమన్ పతకం సాధించడంతో క్రీడాభిమానులు, భారతీయులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ దురదృష్టవశాత్తూ ఫైనల్ పోటీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు.
10 గంటల్లో 4.6 కిలోలు తగ్గిన అమన్
వినేశ్ ఫొగాట్ ప్రభావంతో రెజ్లర్ అమన్ సెహ్రావత్ విషయంలో మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. సెమీస్‌లో ఓటమి తర్వాత గత గురువారం అమన్ బరువు 61.5 కిలోలుగా ఉంది. శుక్రవారం కాంస్య పోరు నాటికి 57 కిలోలు వచ్చేందుకు చాలా శ్రమించాడు. కేవలం 10 గంటల వ్యవధిలోనే 4.6 కిలోలు తగ్గాడు. అందుకు సీనియర్ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాతో పాటు మరో ఆరుగురి బృందం కష్టపడింది.