వినేశ్ ఫొగాట్‌కు రజతం ఇవ్వాలన్న అప్పీల్‌పై 3 గంటల పాటు విచారణ
- కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌లో నిన్న విచారణ
- ఫొగాట్ తరఫున వాదనలు వినిపించిన హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా
- త్వరలో సానుకూల తీర్పు వస్తుందన్న న్యాయవాదులు
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో శక్రవారం సాయంత్రం మూడు గంటల పాటు విచారణ జరిగింది. వినేశ్ తరఫున భారత ఒలింపిక్ సంఘం నియమించిన ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలను వినిపించారు.
విచారణ అనంతరం ఫొగాట్ తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకకు ముందు తీర్పు వెలువడే అవకాశం ఉందన్నారు. విచారణ బాగా జరిగిందని, త్వరలో దీనిపై నిర్ణయం వెల్లడిస్తామని సీఏఎస్ ఆర్బిట్రేటర్ చెప్పారని తెలిపారు. తీర్పు భారత్‌కు సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫొగాట్‌కు సంయుక్తంగా రజతం ఇవ్వాలని తాము బలంగా వాదనలు వినిపించామన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్ వరకు వచ్చిన వినేశ్ ఫొగాట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడింది. దీంతో భారత ఒలింపిక్ సంఘం ఆమెకు రజతం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. భారత్ అప్పీల్‌పై నిన్న విచారణ జరిగింది.