భారత్‌లో మరోసారి హిండెన్‌బర్గ్ ప్రకంపనలు.. వైరల్‌గా మారిన ట్వీట్!
- గతేడాది అదానీ గ్రూప్ కంపెనీలపై నివేదికతో దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసిన హిండెన్‌బర్గ్
- తాజాగా తన ఎక్స్ ఖాతాలో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అంటూ పోస్ట్
- హిండెన్‌బర్గ్ మరోసారి భారత మార్కెట్లలో బాంబు పేల్చనుందా? అని నెట్టింట చర్చ
అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా మరో పోస్ట్ చేసింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని రాసుకొచ్చింది.
దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు రకాల స్పందనలు వస్తున్నాయి. హిండెన్‌బర్గ్ మరోసారి భారత మార్కెట్లలో బాంబు పేల్చనుందా? అని నెట్టింట చర్చ మొదలైంది. ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో? అంటూ దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు.
అయితే, మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్‌బర్గ్ ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం హిండెన్‌బర్గ్ పెట్టిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, తమను తాము అమెరికా 'పెట్టుబడి పరిశోధన సంస్థ'గా పిలుచుకునే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ను నాథన్ ఆండర్సన్ 2017లో స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 10 మంది ఉద్యోగులు ఉన్నారు.