మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి: నాసా
- ఆగస్టు 10 నుంచి 12 వరకు భూమికి చేరువలో మూడు గ్రహశకాలు
- ఆస్టరాయిడ్లను గుర్తించిన నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ
- వీటి వల్ల ముప్పు లేదన్న నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది.
అవి భూమికి బాగా దగ్గరగా వస్తున్నప్పటికీ, వాటి నుంచి ముప్పు ఏమీ ఉండదని నాసా పేర్కొంది. ఈ మూడు గ్రహశకలాల్లో అన్నింటి కంటే పెద్దది కేహెచ్3-2024 అని, ఇది 610 అడుగులు ఉంటుందని నాసా వివరించింది. ఇది పొడవైన భవనం అంత పరిమాణంలో ఉంటుందని వెల్లడించింది. కేహెచ్3 గ్రహశకలం ఆగస్టు 10వ తేదీన భూమికి 5.6 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి వస్తుందని తెలిపింది.
మిగతా రెండు గ్రహశకాల్లో ఒకటైన పీకే1-2024 110 అడుగులతో ఓ చిన్న విమానం సైజులో ఉంటుందని, ఇది భూమికి 6.4 మిలియన్ కిలోమీటర్ల దగ్గరగా వస్తుందని నాసా వెల్లడించింది. దీంతో ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది.
మూడో గ్రహశకలం ఓఎన్2-2024 ఆగస్టు 12న భూ గ్రహానికి దగ్గరగా వస్తుందని, 120 అడుగులు ఉండే ఈ గ్రహశకలం భూమికి 6.8 మిలియన్ కిలోమీటర్లు దగ్గరగా వస్తుందని నాసా వివరించింది. ఇది కూడా భూమిపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. అయితే, భూమండలం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు గ్రహశకలాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని నాసా పేర్కొంది.