వేల కోట్లు ఖర్చు చేస్తే రెండు లక్షల మంది విద్యార్థులు ఎలా తగ్గారు?: మంత్రి నారా లోకేశ్
- 'సాల్ట్' ప్రాజెక్టుపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ సమీక్ష
- ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని స్పష్టీకరణ
- అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు 'సాల్ట్' ప్రాజెక్టుపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన బోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ కచ్చితంగా ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అందరం మోడల్ పీటీఎం సమావేశాలు వస్తామని తెలిపారు.
విద్యపై గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతోందని, వేల కోట్లు ఖర్చు చేస్తే రెండు లక్షల మంది విద్యార్థులు ఎలా తగ్గారని లోకేశ్ ప్రశ్నించారు. ఇక, విద్యార్థుల్లో నైతక విలువలు పెంచేలా, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తామని చెప్పారు.