నీర‌జ్ చోప్రాకు ఫోన్ చేసి ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌... ఇదిగో వీడియో!

  • 89.45 మీటర్లు ఈటెను విసిరి ర‌జ‌తం గెలిచిన‌ నీర‌జ్ చోప్రా
  • 92.97 మీటర్లతో గోల్డ్ కైవ‌సం చేసుకున్న‌ అర్షద్ నదీమ్
  • వరుసగా రెండవ ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి రికార్డు సృష్టించిన నీర‌జ్‌
  • స్వ‌యంగా ఫోన్ చేసి అభినందించిన మోదీ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా గురువారం జ‌రిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఫైన‌ల్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచి ర‌జ‌తం గెలిచిన విష‌యం తెలిసిందే. నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి సిల్వ‌ర్ మెడ‌ల్‌ కైవ‌సం చేసుకున్నాడు. 

దీంతో వరుసగా రెండవ ఒలింపిక్స్‌లోనూ పతకాన్ని గెలుచుకుని రికార్డు సృష్టించాడు. ఇక ఇదే ఈవెంట్‌లో దాయాది పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు.  

కాగా, ర‌జ‌త ప‌త‌కం సాధించిన నీర‌జ్ చోప్రాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభినందించారు. స్వ‌యంగా ఫోన్ చేసి, వ‌రుస‌గా రెండో ఒలింపిక్ మెడ‌ల్ సాధించి దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచావంటూ ప్ర‌శంసించారు. 

స్వ‌ర్ణం కోసం శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేద‌ని చోప్రా ఆవేద‌న వ్య‌క్తం చేయ‌గా, అద్భుతంగా ఆడావ్ అంటూ మోదీ మెచ్చుకున్నారు. గాయంతో ఉన్నప్పటికీ ఉత్తమ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచావు... మేము నిన్ను చూసి గర్విస్తున్నామ‌ని మోదీ అన్నారు. ఆ త‌ర్వాత అత‌ని గాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే నీర‌జ్ త‌ల్లి చూపిన క్రీడాస్ఫూర్తిని కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మెచ్చుకున్నారు.


More Telugu News