అమ్మాయిలు బొట్టు పెట్టుకోవడాన్ని నిషేధించగలరా?: హిజాబ్ నిషేధంపై కాలేజీకి సుప్రీంకోర్టు ప్రశ్న
- హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ముంబయిలోని ఓ కాలేజీ
- హైకోర్టులో సవాల్ చేసిన విద్యార్థి సంఘాలు
- కాలేజీ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
- సుప్రీంకోర్టుకు వెళ్లిన విద్యార్థి సంఘాలు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ కాలేజీ అమ్మాయిలు హిజాబ్‌ను ధరించడంపై నిషేధించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కాలేజీ ఇచ్చిన సర్క్యులర్‌పై నవంబర్ 18 వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది. అమ్మాయిలు బొట్టుబిళ్లలు పెట్టుకోవడం, లేదా తిలకం దిద్దుకోవడాన్ని కూడా ఇలాగే నిషేధిస్తారా? అని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. విద్యార్థినులకు వారు ధరించే దుస్తులపై స్వేచ్ఛ ఉండాలని, కాలేజీలు వారిని వేషదారణపై బలవంతం చేయకూడదని పేర్కొంది. భారత్‌లో అనేక మతాలు ఉన్నాయని తెలిసి ఇలా చేయడం దురదృష్టకరమని పేర్కొంది.
అయితే ముస్లిం విద్యార్థినులను హిజాబ్ ధరించడానికి అనుమతిస్తే హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించే అవకాశాలు ఉన్నాయని కాలేజీ సుప్రీంకోర్టు బెంచ్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిని రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. హిజాబ్‌పై మధ్యంతర ఉత్తర్వులను దుర్వినియోగం చేయవద్దని, అలా జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చునని ఆ కాలేజీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అలాగే, తరగతి గదుల్లో బుర్ఖాలు ధరించవద్దని, క్యాంపస్‌లో మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది.
క్యాంపస్‌లో హిజాబ్ వంటివి ధరించకూడదంటూ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌ను కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. కాలేజీ నిర్ణయాన్ని హైకోర్టు స్వాగతించింది. దీంతో విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కాలేజీ విధించిన షరతులపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయమై నవంబర్ 18వ తేదీలోగా స్పందనను తెలియజేయాలని ముంబయి ఎడ్యుకేషన్ సొసైటీని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కళాశాలకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను వాయిదా వేసింది.