వైసీపీకి మరో గట్టి షాక్... కీలక నేత రాజీనామా
- వైసీపీని వీడిన ఆళ్ల నాని
- వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
- జగన్ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని
ఏపీలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేసిన 48 గంటల్లో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ఏలూరు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు.
జగన్ మంత్రివర్గంలో ఆళ్ల నాని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.