స్టాప్‌లో బస్సు ఆపలేదని.. బీర్‌బాటిల్‌తో దాడిచేసి కండక్టర్‌పై పాము విసిరిన ప్రయాణికురాలు.. వీడియో ఇదిగో!
- హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఘటన
- పట్టుకునేందుకు ప్రయత్నించిన మహిళా కండక్టర్‌పై పాము విసిరిన నిందితురాలు
- భయంతో పరుగులు తీసిన కండక్టర్
- కిందపడి ఎటో వెళ్లిపోయిన పాము
- వీడియోలు తీసేందుకు ఎగబడిన జనం
- రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్ జామ్
బస్సు ఆపలేదని హైదరాబాద్‌లో ఓ మహిళ కండక్టర్‌పై పాము విసిరింది. విద్యానగర్‌లో నిన్న జరిగిన ఈ ఘటన కాసేపు కలకలం రేపింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బస్సు ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యానగర్ బస్టాప్ దాటిన తర్వాత మూలపై నిల్చున్న మహిళ బస్సును ఆపాలని చెయ్యెత్తింది. కాస్త ముందుకు పోనిచ్చిన డ్రైవర్ రోడ్డు పక్కగా ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో బస్సు ఆపలేదన్న కోపంతో ఊగిపోయిన మహిళ బస్సు వెనక అద్దంపైకి బీర్ బాటిల్ విసిరింది.
బస్సు ఆగిన వెంటనే కిందికి దిగిన మహిళా కండక్టర్ నిందితురాలిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితురాలు వెంటనే తన వద్దనున్న బ్యాగ్ తెరిచి అందులోంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరింది. దీంతో భయపడిపోయిన కండక్టర్ పరుగులు తీసింది. పాము కిందపడి ఎటో వెళ్లిపోయింది.
ఈ ఘటనతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ గొడవతో అక్కడ గుమికూడిన జనం ఈ ఘటనను వీడియో తీసుకుంటే, మరికొందరు పాము వెంట పరుగులు తీశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు పామును ఎక్కడి నుంచి తెస్తోంది? ఎందుకు తెస్తోంది? అన్న దానిపై ఆమెను ప్రశ్నిస్తున్నారు.