పారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ప్రస్థానం

  • పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల కరవు
  • ఒక్క పతకం లేకుండానే వెనుదిరిగిన జ్యోతి
  • 100 మీటర్ల హర్డిల్స్ రెపిచేజ్ లో విఫలం 
ఆసియా క్రీడల రజత పతక విజేత, తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి పారిస్ ఒలింపిక్స్ లో నిరాశపర్చింది. పరుగుల రాణిగా పేరొందిన 24 ఏళ్ల జ్యోతి యర్రాజి పతకం లేకుండానే పారిస్ ఒలింపిక్స్ లో తన ప్రస్థానం ముగించింది. 

ఇవాళ జరిగిన 100 మీటర్ల మహిళల హర్డిల్స్ రెపిచేజ్ రౌండ్ లో జ్యోతి 13.17 సెకన్ల టైమింగ్ తో 4వ స్థానంలో నిలిచింది. 

హీట్స్ (క్వాలిఫైయింగ్ రౌండ్స్)లో అర్హత సాధించలేకపోయినా, మంచి టైమింగ్ నమోదు చేసినవాళ్లను ఎంపిక చేసి, ఫైనల్ చేరేందుకు వారికి మరో అవకాశం కల్పిస్తారు. దాన్నే రెపిచేజ్ రౌండ్ అంటారు. 

కానీ, జ్యోతి యర్రాజికి రెపిచేజ్ ద్వారా మంచి అవకాశం వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత్ లో 100 మీటర్ల మహిళల హర్డిల్స్ లో అత్యుత్తమ టైమింగ్ జ్యోతి యర్రాజిదే. ఈ ఉత్తరాంధ్ర అమ్మాయి 100 మీటర్ల హర్డిల్స్ లో 12.78 సెకన్ల టైమింగ్ తో జాతీయ రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్ లో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.


More Telugu News