ఈ కష్టకాలంలో నా తల్లిని చూడలేకపోయాననే బాధ ఉంది: షేక్ హసీనా కూతురు

  • నా తల్లిని కౌగిలించుకోలేకపోయాననే బాధ గుండెను పిండేస్తోందన్న సైమా
  • కష్టకాలంలో అమ్మకు తోడుగా ఉండలేకపోతున్నానంటూ ట్వీట్
  • నా దేశంలో జరిగిన ప్రాణనష్టం చూసి గుండె పగిలిందని వ్యాఖ్య
ఈ కష్టకాలంలో నా తల్లిని చూడలేకపోయాననే బాధ ఉందని, నా తల్లిని కౌగిలించుకోలేకపోయాననే బాధ గుండెను పిండేస్తోందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు సైమా వాజెద్ ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడంతో పాటు ఆ దేశాన్ని వీడి, భారత్ లో తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో తన తల్లి పరిస్థితిపై సైమా ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు.

ఈ కష్టకాలంలో అమ్మకు తోడుగా ఉండలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. నేను ప్రేమించే నా దేశంలో జరిగిన ప్రాణనష్టం చూసి తన గుండె పగిలిందన్నారు. ఇలాంటి కష్టకాలంలో తన తల్లిని చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయ ఆసియా రీజినల్ డైరెక్టర్‌గా విధి నిర్వహణకు కట్టుబడి ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా, ఆమె పనిచేస్తున్న కార్యాలయం ఢిల్లీలోనే ఉన్నప్పటికీ, భద్రతా కారణాల రీత్యా తల్లిని కలుసుకోవడం ఆమెకు వీలుపడడం లేదు. 


More Telugu News