వినేశ్ ఫొగాట్‌ను కూర్చోబెట్టి మాట్లాడుతాను: మహావీర్ ఫొగాట్
- నిర్ణయాన్ని మార్చుకోవాలని వినేశ్‌కు సూచన
- ఆమెకు సర్ది చెబుతానన్న మహావీర్ ఫొగాట్
- ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారన్న మహావీర్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పైనల్‌లో అనర్హత వేటు పడిన అనంతరం మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కుస్తీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ స్పందించారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని వినేశ్‌కు సూచించారు. ఆమెను కలిసి మాట్లాడుతానని, ఆమెకు సర్దిచెప్పి నిర్ణయం మార్చుకునేలా చేస్తానన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ ఘటనతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అభిప్రాయపడ్డారు.
ఆమె ఈ విషయాన్ని ఈ తెల్లవారుజామున 5 గంటలకు తెలియజేసిందని, ఒలింపిక్స్‌లో ఫైనల్ దగ్గరకు వచ్చి పతకాన్ని కోల్పోవడంతో ఆమె ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చునన్నారు. ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుతానన్నారు. విజయానికి ఇంత దగ్గరగా వచ్చి... ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరైనా ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నారు.