నేపాల్ లో కుప్పకూలిన మరో హెలికాఫ్టర్ .. ఐదుగురి దుర్మరణం
- నేపాల్ లో తరచూ విమాన ప్రమాదాలు
- ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సికి వెళుతూ సువాకోట్ సమీపంలో కుప్పకూలిన హెలికాఫ్టర్
- రెండు వారాల్లోనే రెండో ప్రమాదం
నేపాల్ లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా గుర్తించారు.
ఇటీవల (గత నెల చివరి వారంలో) త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలి, 18 మంది మృతి చెందారు. రెండు వారాల వ్యవధిలోనే రెండో ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాది యతి ఎయిర్ లైన్స్ విమానం పొఖారా విమానాశ్రయం వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 72 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం నేపాల్ చరిత్రలోనే మూడో అతి పెద్ద దుర్ఘటన.