శ్రీలంక చేతిలో ఇంత ఘోరంగానా... కుప్పకూలిన టీమిండియా

  • చివరి వన్డేలో 110 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
  • 249 పరుగుల ఛేజింగ్ లో 138 పరుగులకే టీమిండియా ఆలౌట్
  • సొంతగడ్డపై 2-0తో సిరీస్ చేజిక్కించుకున్న శ్రీలంక
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘోరంగా ఆడి ఓటమిపాలైంది. ఆతిథ్య శ్రీలంక ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. 

శ్రీలంక నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు కేవలం 26.1 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లతో టీమిండియా వెన్నువిరిచాడు. కెప్టెన్  రోహిత్ శర్మ 35, కోహ్లీ 20 పరుగులు చేశారు. చివర్లో వాషింగ్టన్ 30 పరుగులు చేయడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

శుభ్ మాన్ గిల్ (6), రిషబ్ పంత్ (6), శ్రేయాస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ 2, రియాన్ పరాగ్ (15), శివమ్ దూబే (9) నిరాశపరిచారు. లంక బౌలర్లలో వెల్లలాగే 5, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే 2, అసిత ఫెర్నాండో 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో శ్రీలంక 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. తొలి వన్డే టై కాగా, రెండో వన్డేలో నెగ్గిన శ్రీలంక... ఇవాళ మూడో వన్డేలోనూ విజయభేరి మోగించడం విశేషం. 

శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఈ సిరీస్ విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీలంక జట్టు ద్వైపాక్షిక వన్డే సిరీస్ ల్లో టీమిండియాపై గెలవడం 27 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. చివరిసారిగా 1997లో శ్రీలంక జట్టు భారత్ పై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది.


More Telugu News