పాత మద్యం బ్రాండ్లు తీసుకువస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

  • నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం
  • మద్యం అంశం చర్చించామన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
  • రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు చేస్తామని వెల్లడి 
  • కల్తీ మద్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని స్పష్టీకరణ
ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మద్యం వ్యవహారంపై కూడా చర్చించినట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మద్యంపై వచ్చే ఆదాయం కోసం గత పాలకులు అడ్డదారులు తొక్కారని విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తిపడి కల్తీ మద్యం బ్రాండ్లను ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపారు.  కల్తీ మద్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని కొల్లు రవీంద్ర అన్నారు. పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మద్యంపై ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.


More Telugu News