పరాగ్ మ్యాజిక్... శ్రీలంకను కట్టడి చేసిన టీమిండియా
- కొలంబోలో మూడో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు
- ఓ దశలో 1 వికెట్ కు 171 పరుగులు చేసిన లంక
- 3 వికెట్లతో లంకను దెబ్బతీసిన పరాగ్
కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న టీమిండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో... భారీ స్కోరు దిశగా వెళుతోందనుకున్న శ్రీలంక అనూహ్యరీతిలో తక్కువ స్కోరుకే పరిమితమైంది. రియాన్ పరాగ్ 3 కీలక వికెట్లు తీసి శ్రీలంక పరుగుల జోరుకు కళ్లెం వేశాడు.
ఓ దశలో 1 వికెట్ కు 171 పరుగులతో ఉన్న శ్రీలంక... రియాన్ పరాగ్ బంతి అందుకున్న తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. చివరికి 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది.
శ్రీలంక ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో అత్యధికంగా 96 పరుగులు చేశాడు. ఈ వికెట్ రియాన్ పరాగ్ ఖాతాలో చేరింది. ఆ తర్వాత శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక (10), దునిత్ వెల్లలాగే (2) కూడా పరాగ్ కే వికెట్లు అప్పగించారు. వెల్లలాగే లోయార్డర్ లో ఎంతో ప్రమాదకర బ్యాట్స్ మన్ అని తెలిసిందే.
శ్రీలంక ఇన్నింగ్స్ లో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 45, కుశాల్ మెండిస్ 59 పరుగులు చేశారు. ఆఖర్లో కమిందు మెండిస్ 23 పరుగులు చేయడంతో శ్రీలంకకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. టీమిండియా బౌలర్లలో పరాగ్ 3, సిరాజ్ 1, అక్షర్ పటేల్ 1, వాషింగ్టన్ సుందర్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.