వినేశ్‌... నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌!: అనర్హత వేటుపై ప్రధాని మోదీ

  • పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై చివ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు 
  • 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన మోదీ
  • ఆమెను ఓదార్చుతూ ట్వీట్
పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై చివ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. దీని పట్ల ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఆమెను ఓదార్చుతూ ఓ ట్వీట్ చేశారు.

"వినేశ్‌, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఓ మార్గ‌ద‌ర్శి. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీనిపై విచారం వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్లను ఎదిరించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం" అని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, వినేశ్ 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో పోటీ పడాల్సి ఉంది. దీంతో ఆమె బరువును చూసిన నిర్వాహకులు ఆమె అదనపు బరువు పెరిగినట్లు గుర్తించారు. 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ వినేశ్‌పై అనర్హత వేటు వేశాయి. దీంతో, ఫైనల్ లో ఆమె కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులు చేదు వార్తను వినాల్సి వ‌చ్చింది.


More Telugu News