మానవత్వం మరిచిన జనం.. ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే పాల కోసం ఎగబడిన వైనం!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. హైవేపై మిల్క్ ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, స్థానికులు మానవత్వాన్ని మరిచారు. వారి కళ్లముందే మృతదేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహించారు.
మిల్క్ ట్యాంకర్ నుంచి లీకైన పాలను బాటిళ్లలో పట్టుకునేందుకు ఎగబడ్డారు. ఈ దారుణ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్‌ను ప్రేమ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.